లాక్ డౌన్ ఈ నెల 14 తో ముగుస్తుంది , అంటే మరో వారం రోజుల్లో ముగుస్తుంది, మరి కేంద్రం ఏం ఆలోచన చేస్తోంది.. లాక్ డౌన్ పై చాలా రాష్ట్రాల్లో ఇంకా పొడిగించాలి అని పిలుపు వస్తోంది, మరి దీనిపై కేంద్రం ఏ విధంగా ముందుకు వెళుతుంది అంటే చాలా విషయాలు కేంద్రం ఆలోచన చేస్తోంది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి.. లాక్ డౌన్ పొడిగింపుకు అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు. అయితే, దానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఇంటి నుంచి ప్రజలు బయటకు రాకుండా ఉండాలి అని ఆయన తెలిపారు ..ప్రతిరోజు తాజా కూరగాయల కోసం ప్రజలు ఇళ్లనుండి బయటకు రాకూడదన్నారు. వారానికి సరిపడా కూరగాయలు, నిత్యావసర వస్తువులను ఒకేసారి తెచ్చుకోవాలని చెప్పారు.
అయితే అన్నీ స్టేట్స్ కోరడం పైగా ముఖ్యమంత్రులు కూడా లాక్ డౌన్ పొడిగించాలి అని కోరడం, ఇంకా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి, కేంద్రం కూడా అదే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి, మరో 15 రోజులు అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు ఇది కంటిన్యూ చేసే ఆలోచన చేస్తోందట, ఈ సమయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.