కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా నృత్యం చేస్తుండటంతో చాలా దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి.. దీంతో వివాహాలు వాయిదా పడ్డాయి… తాజాగా న్యూయార్క్ ప్రభుత్వం పెళ్లిళ్లు వాయిదా పడకుండా ఉండేందుకు ఒక నిర్ణయం తీసుకుంది… వీడియో కాల్స్ ద్వారా పెళ్లిళ్లు చేసుకుని వెసులుబాటునుకల్పించింది… వీడియో కాల్స్ ద్వారా పెళ్లి చేసుకుంటే సామాజిక దూరం పాటిస్తూనే, వివాహం కూడా జరుపుకునే అవకాశం ఉండడంతో వాటికి అనుమతి ఇచ్చింది.
జూమ్ వీడియో కాల్ యాప్ ద్వారా పెళ్లి చేసుకోవచ్చు అని గవర్నర్ అండ్రూ క్యూమో ఆదేశాలు జారీ చేశారు… ఇటువంటి పెళ్లిళ్లకు చట్టబద్దత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు…
ఇక ఆండ్రూ తీసుకున్న నిర్ణయానికి అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. కాగా లాక్ డౌన్ సమయంలో జూమ్ యాప్ ను చాలామంది ఉపయోగిస్తున్నారు… మీటింగ్ లు, తరగలు వివిధ వాటికి ఈ యాప్ ను ఉపయోగిస్తున్నారు.