లాక్ డౌన్ ఈనెల 31 వరకూ ఇవి తెరచుకోవు, ఈ పనులు చేయకండి

లాక్ డౌన్ ఈనెల 31 వరకూ ఇవి తెరచుకోవు, ఈ పనులు చేయకండి

0
85

రెండు తెలుగు స్టేట్స్ ఇప్పుడు లాక్ డౌన్ ప్రకటించాయి, ఇక కరోనా కట్టడి కోసం ఇలాంటి జాగ్రత్తలు
తీసుకోవాల్సిందే అని తెలిపారు ఇద్దరు సీఎంలు, ఇక ఈ సమయంలో ఎవరూ బయటకు రాకుండా జనతా కర్ఫ్యూలా ఇది కూడా పాటించాలి అని తెలిపారు సీఎం కేసీఆర్ సీఎం జగన్, ఇక నిత్య అవసరాలు మాత్రం అన్నీ దొరుకుతాయని చెప్పారు.

కూరలు పాలు మందులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.. నిత్య అవసరాలు దొరికే పచారీ కొట్లు కూడా తీసుకోవచ్చు అని తెలిపారు… 1897 నాటి చట్టాన్ని అమల్లోకి తెస్తూ తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించారు సీఎం కేసీఆర్. ఇక ఇతర స్టేట్స్ నుంచి వాహనాలు ఇక్కడకు రావు, ఇక్కడవి వేరే స్టేట్స్ కు వెళ్లకుండా ఆగిపోతాయి.

ఏం చేయకూడదు అంటే..

ప్రజలు గుంపులు గుంపులుగా తిరగకూడదు.
వివాహలు ఫంక్షన్లు ఎలాంటివి చేయకూడదు
పదుల సంఖ్యలో గ్రూపులుగా ఉండకూడదు
ఎలాంటి టూర్లు ప్రయాణాలు చ ఏయకూడదు
5 గురు మించి ఎక్కువ తిరగకూడదు
విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజులు ఇంటిలోనే ఉండాలి
60 ఏళ్లు దాటిన వారు ఇంటినుంచి బయటకు రాకూడదు
బస్సులు, క్యాబ్లు, ఆటోలు మొత్తం బంద్ చేయాలి
వ్యాపార సముదాయాలు, షాపింగ్ మాల్స్, ధియేటర్లు, జిమ్లు, ఫంక్షన్ హాళ్లు మూసేయాలి
చిన్న పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపకూడదు.