లాక్ డౌన్ వేళ ఇంటికి చేరుకోవడానికి ఈ యువకుడు చేసిన సాహసం రికార్డే

లాక్ డౌన్ వేళ ఇంటికి చేరుకోవడానికి ఈ యువకుడు చేసిన సాహసం రికార్డే

0
77

లాక్ డౌన్ వేళ అందరూ ఇంటికి పరిమితం అయ్యారు, ఎవరూ బయటకు రాని పరిస్దితి.. ఎక్కడ వారు అక్కడ చిక్కుకున్నారు, ఈ సమయంలో ముంబైలో చిక్కుకుపోయిన ఓ యువకుడు, యూపీలోని అలహాబాద్ సమీపంలో ఉన్న తన స్వగ్రామానికి ఎలాగైనా వెళ్లాలన్న ఆలోచనతో మాస్టర్ ప్లాన్ వేసి సక్సెస్ అయ్యాడు, కాని దాని వెనుక చాలా ఇబ్బందులు పడ్డాడు.

అతని పేరు ప్రేమ్ మూర్తి ..ముంబైలోని విమానాశ్రయంలో పని చేస్తుంటాడు. ఈ లాక్ డౌన్ తో ఇంటికివెళ్లిపోవాలి అని భావించాడు. ముందు కొద్ది రోజులు ముంబైలోనే ఉన్నాడు, అక్కడ
అంధేరీ ఈస్ట్ ప్రాంతంలోని ఆజాద్ నగర్ లో నివాసం ఉన్నాడు, కాని ఇది చాలా ఇరుకు ప్రాంతం.. వైరస్ ప్రబలే అవకాశం ఉంది అని భయపడి ఇంటికి వెళ్లాలి అని భావించాడు.

పండ్లు, కూరగాయల వాహనాలకు అనుమతి ఉందని గమనించాడు ప్రేమ్ మూర్తి.. నాసిక్ లోని పింపాల్ గావ్ మార్కెట్ నుంచి మినీ ట్రక్ ను అద్దెకు తీసుకుని రూ. 10 వేల విలువైన పుచ్చకాయలను కొనుగోలు చేసి, దానితో పాటు ముంబైకి ప్రయాణించి, ట్రయల్ వేశాడు. ఆ పుచ్చకాయలను విక్రయించి, తన పెట్టుబడిని వెనక్కు తెచ్చుకున్నాడు.

అక్కడ నుంచి ఉల్లిపాయాలు కొనుగోలు చేశాడు. కిలోకు రూ. 9.10 చొప్పున రూ. 2.32 లక్షలతో 25,520 కిలోల లోడ్ ను కొన్నాడు. ఆపై రూ. 77,500 చెల్లించేందుకు అంగీకరించి, ఓ లారీని అద్దెకు తీసుకున్నాడు. ఉల్లిపాయల లోడ్ తో 1,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలహాబాద్ కు బయలుదేరాడు.
అక్కడ ఉల్లి మాత్రం ఎవరూ కొనలేదు, దీంతో లోడ్ తనగ్రామానికి తీసుకువెళ్లి అక్కడే స్టోర్ చేశాడు. రెండున్నర లక్షలు పెట్టుబడి పెట్టాడు.. కాని మొత్తానికి ఇంటికి చేరుకున్నాడు, ఉల్లి తర్వాత అయినా అమ్ముకుంటాను ముందు సేఫ్ గా ఇంటికి వచ్చాను అని తెలిపాడు, వెంటనే ఆస్పత్రికి వెళ్లి అక్కడ టెస్ట్ చేయించుకున్నాడు, నెగిటీవ్ వచ్చింది ఇంట్లోనే 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలి అని తెలిపారు వైద్యులు.