లాక్ డౌన్ వేళ రైళ్లకు తాళాలు ఎందుకో తెలుసా

లాక్ డౌన్ వేళ రైళ్లకు తాళాలు ఎందుకో తెలుసా

0
70

మన దేశంలో పూర్తిగా లాక్ డౌన్ అమలు అవుతోంది, దీంతో ప్రజారవాణ పూర్తిగా నిలిచిపోయింది, ఈ సమయంలో దాదాపు వేళ ట్రైన్స్ నిలిచిపోయాయి… పాసింజర్ రైళ్లు ఎక్స్ ప్రెస్ లు అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి, దేశంలోనెల నుంచి ఒక్క రైలు కూడా నడవడం లేదు, ఇక అన్నీ రాష్ట్రాల్లో కలిపి లక్షలాది ప్రభుత్వ ప్రైవేట్ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి, కేవలం వైద్య పోలీసులకు మాత్రమే ఈ బస్సులు స్పెషల్ గా కొన్ని చోట్ల తిప్పుతున్నారు.

అయితే రైళ్లకు ఇప్పుడు ఓ చిక్కు వచ్చి పడింది. పెద్ద చిన్న అన్నీ స్టేషన్లలో రైళ్లు నిలిపివేశారు
బోగీలను ఇంజిన్ల నుంచి వేరు చేశారు. ఇక ఇదే సమయంలో ఎత్తు పల్లాలు ఉన్న చోట్ల రైళ్లు కదిలే ప్రమాదం ఉందని భావించిన అధికారులు, పట్టాలతో రైలు కోచ్ లను కలుపుతూ తాళాలు వేశారు.

ఇలా ఎత్తుపళ్లాలుఉన్న చోట రైలు కదిలితే అది చాలా ప్రమాదం అని భావించి, ఇలా తాళాలు వేశారు..
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, విజయవాడ, తిరుపతి, కాకినాడ వంటి పలు రైల్వే స్టేషన్లలో ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్లు, పాసింజర్ రైళ్లు పట్టాలపై ఉన్నాయి, వీటికి లాక్స్ వేయడం ఐరెన్ రాడ్స్ పెట్టడం వల్ల లాక్స్ గా ఉంటాయి అని ఉద్యోగులు చెబుతున్నారు, దేశంలో గూడ్స్ రైళ్లు మాత్రం యథాతధంగా నడుస్తున్నాయి.