లాక్ డౌన్ వేళ రైల్వే స్టేష‌న్ కు వేలాదిగా జ‌నం ఎందుకో తెలుసా

లాక్ డౌన్ వేళ రైల్వే స్టేష‌న్ కు వేలాదిగా జ‌నం ఎందుకో తెలుసా

0
90

దేశంలో లాక్ డౌన్ అమ‌లు అవుతోంది… నేడు ప్ర‌ధాని మోదీ లాక్ డౌన్ ఎత్తివేస్తారు అని చాలా మంది భావించారు.. కాని మ‌రో 19 రోజులు పొడిగించారు ఈ స‌మ‌యంలో ప్ర‌తీ ఒక్క‌రూ కూడా దీనిని పాటించాలి అని తెలిపారు.

ఈ స‌మ‌యంలో ముంబయి బాంద్రా రైల్వే స్టేషన్ ద‌గ్గ‌ర జ‌నం వేల సంఖ్యలో గుమిగూడారు .వేలాది మంది వలస కూలీలు త‌మ‌ని స్వ‌గ్రామాల‌కి పంపాలి అని కోరారు. అయితే ఇంత‌లా ఎందుకు చేరారు అంటే,లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన రైళ్ళు మళ్లీ నడుస్తాయనే నమ్మకంతో వలస కూలీలు వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

అయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామ‌ని అక్క‌డ అధికారులు పోలీసులు తెలిపారు, ఇలా గుమిగూడి ఉండ‌ద్దు అని చెప్పారు, దీంతో వారు శాంతించి షెల్ట‌ర్ల‌కు చేరారు, వీరినిచూసి పోలీసులు కూడా బాధ‌ప‌డ్డారు, అయితే కాస్త వైర‌స్ ప్ర‌భావం త‌గ్గితే ర‌వాణా సౌక‌ర్యాలు ఉంటాయి అంటున్నారు అధికారులు.