లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ ఉంటుందా? మంత్రి కేటీఆర్​ సమాధానం ఇదే!

Lockdown, will there be a night curfew? This is the answer of Minister KTR!

0
112

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో ‘’ఆస్క్‌ యువర్‌ కేటీఆర్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెటిజిన్లు ఉత్సాహంగా పాల్గొని మంత్రిని ప్రశ్నలు అడగగా సమాధానాలిచ్చారు. కేటీఆర్‌ కేంద్ర ఐటీ మంత్రి కావాలని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేయగా…సొంత రాష్ట్రానికి సేవ చేస్తూ సంతోషంగా ఉన్నట్టు కేటీఆర్‌ సమాధానమిచ్చారు.

ఫైబర్‌ నెట్‌ ద్వారా తొలి దశలో 2022 ఏప్రిల్‌ కల్లా తెలంగాణలోని గ్రామాల్లో ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. యూపీలో ప్రస్తుతం సమాజ్‌ వాది పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఓ నెటిజన్‌ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ ఉంటుందా అని నెటిజన్​ అడిగిన ప్రశ్నకు.. కొవిడ్ కేసుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. వైద్యారోగ్యశాఖ సలహా మేరకు నిర్ణయముంటుందని మంత్రి స్పష్టం చేసారు. ప్రేమపూర్వకమైన రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం తన అదృష్టమని మంత్రి కేటీఆర్​ అన్నారు.