తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణల ఆకాంక్షలు నెరవేర్చేందుకు, తెలుగుదేశం పార్టీ ఆశయ సాధనకు కృషిచేస్తూ. ప్రజాసేవలో తనదైన ముద్ర వేసుకుంటున్న నందమూరి సుహాసినికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆమెకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను ప్రసాదించాలని మనసారా ఆశీర్వదిస్తున్నానని అన్నారు….
అలాగే లోకేశ్ కూడా శుభాకాంక్షలు చెప్పారు… మావయ్య హరికృష్ణ వారసురాలిగా, ఆయన ఆశయాలతో పాటు, మంచితనాన్ని, డైనమిజాన్ని అందిపుచ్చుకున్న నందమూరి సుహాసిని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలని చెప్పారు…
మీరు నిండు నూరేళ్ళూ ఆనందారోగ్యాలతో ప్రజలకు సేవచేస్తూ, వారి అభిమానాన్నీ, ప్రేమను పొందాలని కోరుకుంటున్నానని చెప్పారు… కాగా తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భాగంగా సుహాసిని టీడీపీ తరపున రాజకీయ అరంగేట్రం చేసి కుకట్ పల్లి లో పోటీ చేసిన సంగతి తెలిసిందే… ఆమె పోటీ చేసిన తొలిసారే ఓటమి చెందారు…