జగన్ పై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

జగన్ పై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

0
77

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ద్రోహి ముఖ్యమంత్రి జగన్ అని టీడీపీ నేత లోకేశ్ ఆరోపించారు ఉత్తరాంధ్ర యువత ఉపాధి పొందుతున్న ఐటీ కంపెనీలను విశాఖ నుండి హైదరాబాద్ కు తరిమేస్తున్నారని ఆరోపించారు. ఐటీ సెజ్ ఖాళీ చేయిస్తున్నారని మండిపడ్డారు. మూడు ముక్కల రాజధాని వస్తుంది అంటూ విశాఖకు వచ్చేందుకు సిద్ధమైన పెద్ద కంపెనీలను ఛీ కొట్టారని అన్నారు.

అలాగే రాయలసీమకి వస్తా అన్న ఎలక్ట్రానిక్స్ కంపెనీలను రాకుండా చేసి అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నారని లోకేశ్ ఆరోపించారు. కర్నూలుకి హై కోర్టు తరలించే ప్రక్రియ గురించి ఆలోచిస్తాం అంటూ మరో బిస్కెట్ వేసి రాయలసీమ వాసుల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు

మూడుముక్కలాట తప్ప ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసం ఏం చేస్తారో జగన్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు లోకేశ్ మీ స్వార్థం కోసం కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజలు కొట్టుకొని చావాలా అని లోకేశ్ మండిపడ్డారు