జగన్ పై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

జగన్ పై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

0
86

జరగాలి పెళ్లి, మళ్ళీ మళ్ళీ.. అనే కాన్సెప్ట్, ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసి పెట్టారేమోనని టీడీపీ నేత లోకేశ్ ఆరోపించారు… ఎంతో కష్టపడి తాము కంపెనీలను తీసుకువచ్చామని తెలిపారు… ఇటీవలే కియా మోటార్స్ ని బెదిరించినట్టు, ఇప్పుడు మరో కంపెనీని కూడా బెదరగొట్టి తరిమేయకండని లోకేశ్ కోరారు…

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు టొరే కంపెనీ కోసం ఎంతో కష్టపడి, వారితో ఫాలో అప్ చేసి, తీసుకువచ్చారని గుర్తు చేశారు లోకేశ… టీడీపీ హయాంలో, భూమి పూజ అయిపోయిన కంపెనీ, అప్పుడే బిల్డింగ్లు రెడీ అయిపోయిన కంపెనీ, ఇప్పుడు తామే తెచ్చినట్టు హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు…

కియా మోటార్స్ విషయంలో, లెటర్ చదువుతూ అధ్యక్షా అంటూ, బుర్ర కధ వినిపించారని ఆర్థికమంత్రి బుగ్గనపై సెటైర్స్ వేశారు…. అలాగే, చంద్రబాబు హయాంలో కష్టపడి తెచ్చిన టీసీఎల్ ని, తమ ఖాతాలో వేసుకున్నారని మండిపడ్డారు…