ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటేసిన వారిని కాటేస్తోందని టీడీపీ నేత నారాలోకేశ్ నిప్పులు చేరిగారు… మద్యపాన నిషేధం పేరుతో వైసీపీప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటున్న తీరుని సోషల్ మీడియాలో ఎండగట్టినందుకు దళిత యువకుడు ఓం ప్రతాప్ ని బలితీసుకుందని ఆయన ఆరోపించారు…
చంపేస్తాం అంటూ వైసీపీ నాయకుల బెదిరింపులు, పోలీసుల వేధింపుల కారణంగానే చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమాల మండలం, కందూరు గ్రామంలో ఓం ప్రతాప్ చనిపోయాడని అన్నారు లోకేశ్… ఓం ప్రతాప్ మృతి పై విచారణ చేపట్టాలని లోకేశ్ డిమాండ్ చేశారు…
ఈ ఘటన వెనుక ఉన్న వైసీపీ ముఖ్యనాయకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు… దళితులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదా?దళితులపై జగన్ రెడ్డి ప్రభుత్వ దాష్టికాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు లోకేశ్…