లోకేష్ కు కాదు ఈ నాయకుడికి బాధ్యతలు

లోకేష్ కు కాదు ఈ నాయకుడికి బాధ్యతలు

0
84

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కొత్త పిలుపు వినిపిస్తోంది.. సైకిల్ పార్టీని ముందుకు నడిపించేది ఎవరు అనే చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత పార్టీని లోకేష్ ముందుకు నడిపించలేడు అంటున్నారు కొందరు నేతలు.. అంతేకాదు ఆయన ఉంటే పార్టీలో చాలా మంది నేతలు బయటకు వెళతారు అంటున్నారు.. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు ఉన్నాయి అనేది వంశీ విమర్శలతో తేలిపోయింది.. అందుకే టీడీపీ అధినేత కీలక నిర్ణయం తీసుకోవాలి అంటున్నారు.

ఇప్పుడు లోకేష్ కు పార్టీ బాధ్యతలు ఇచ్చే అవకాశం లేదు.. కొన్ని నెలల తర్వాత ఇవ్వాలి అని సీనియర్లు చెబుతున్నారు… అయితే తెలుగుదేశం పార్టీలో యువనాయకుడిని ఎవరిని అయినా చూసి పార్టీ యువ బాధ్యతలు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇస్తే పార్టీ ముందుకు సాగుతుంది అంటున్నారు.. ముఖ్యంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరు వినిపించింది.. అయితే ఆయన ఈ బాధ్యతలు తీసుకోవడానికి సుముఖంగా లేరు అని వార్తలు వస్తున్నాయి. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.