జగన్ కు లోకేశ్ సూటిగా రెండు ప్రశ్నలు…

జగన్ కు లోకేశ్ సూటిగా రెండు ప్రశ్నలు...

0
88

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై చాలామందితో విచారణ చేయించారని టీడీపీ నేత లోకేశ్ అన్నారు.. విచారణ చేయించిన తర్వాత ఏమైందని లోకేశ్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు…

వైసీపీ నాయకులు ఇప్పుడు కొత్తగా సిట్ అంటున్నారని. అది కూడా బాబాయ్ మర్డర్లు లాంటి విచారణ చెయ్యాల్సిన పోలీసులతో ? ఇక్కడే అర్ధం అవుతుందని అన్నారు యువమేత ఆత్రం…. సాధించింది, సాధించేది ఏమి లేనప్పుడు సిట్ లతో కాలక్షేపం చెయ్యడమే అని అన్నారు..

గత 9 నెలలుగా, మంత్రుల స‌బ్ క‌మిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్ విచారణ, సీఐడీ విచారణ, ఐటికి, ఈడీ కి ఉత్తరాలు రాసి విచారణ చెయ్యమన్నారు ఏమైందని ప్రశ్నించారు లోకేశ్

‘మహామేత” అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిపై, 26 పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, 4 అధికారులతో విచారణలు, 1 సిబిసిఐడి విచారణ చేయించారు ఏమైంది అన్నారు