జగన్ పై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

జగన్ పై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

0
81

విశాఖలో ఉన్న కంపెనీలను ఖాళీ చేయించారని… కొత్తగా వస్తాం అన్న కంపెనీలను తరిమేశారని లోకేశ్ ఆరోపించారు…. ఉత్తరాంధ్ర యువతకి వచ్చే ఉద్యోగాలను కాలితో తన్ని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వస్తున్నాను అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పడం మసి పూసి మారేడు కాయని చెయ్యడమే అని లోకేశ్ ఆరోపించారు…

అమరావతిలో చంద్రబాబు నిర్మించిన భవనాల్లో ఉండటానికి జగన్ ఇష్టపడటం లేదని ఆరోపించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, యువతకి ఉద్యోగాలు కల్పించడానికి చంద్రబాబు ఏర్పాటు చేసిన భవనాల్లో కంపెనీలు ఖాళీ చేయించి అక్కడే కూర్చుంటాను అని జగన్ అంటున్నారని మండిపడ్డారు లోకేశ్

అలాగే వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎంత నీచానికైనా దిగుతుందని ఆరోపించారు జగన్ వేసే 5 రూపాయిల ముష్టి కోసం ఎంతకైనా దిగజారుతారని ఆరోపించారు. దేనినైనా మార్ఫింగ్ చేస్తారు. రైతుల మరణాన్ని కూడా అపహాస్యం చేసే నీచ సంస్కృతి వైసీపీదని ఆరోపించారు….