మంత్రి అనిల్ కుమార్ ను మళ్లీ టార్గెట్ చేసిన లోకేశ్

మంత్రి అనిల్ కుమార్ ను మళ్లీ టార్గెట్ చేసిన లోకేశ్

0
132

వైసీపీ సర్కార్ ప్రవేశ పెట్టిన నవరత్నాల సంగతి దేవుడెరుగు తాగడానికి నీళ్లు ఇస్తే అదే పదివేలు మహాప్రభో అని రాష్ట్ర ప్రజలు అంటున్నారని టీడీపీ నేత లోకేశ్ అన్నారు… ఈమేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు… కొసమెరుపు ఏమిటి అంటే, వైసీపీ కార్యకర్తలే నీళ్ళు ఇవ్వండి అంటూ, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారని అన్నారు…

అటు తెలంగాణా నీటిని సద్వినియోగం చేసుకుంటే, మన రాష్ట్రం మాత్రం సముద్రంలోకి వదిలింది. దానికి తోడు ముందు చూపు లేని, పాలకులు. అన్నీ వెరసి, ఈ రోజు వేసవి కంటే, రెండు నెలల ముందు నుంచే, తాగు నీటి కోసం, ఆందోళనలు చెయ్యాల్సిన పరిస్థితి.

రత్నాలు దేవుడెరుగు, తాగడానికి నీళ్లు ఇస్తే అదే పదివేలు మహాప్రభో అంటున్నారు ప్రజలు. రికార్డు స్థాయిలో వరదలు వచ్చాయి. నీటిని ఒడిసి పట్టుకోవాల్సిన ప్రభుత్వం, చంద్రబాబు ఇల్లు ముంచటానికి, కిందకు వదిలేశారు.