లోకేశ్ వరుస ట్వీట్లు ఇబ్బందులకు గురి అవుతున్న వైసీపీ

లోకేశ్ వరుస ట్వీట్లు ఇబ్బందులకు గురి అవుతున్న వైసీపీ

0
85

జగన్ అనే నేను అంటూ (కోతల రాయుడు) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏమేం కోతలు కోశారో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను ఎలా కోతలకు గురి చేస్తున్నారో చూడండని లోకేష్ ఫైర్ అయ్యారు . అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే, అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1100 కోట్లు ఇస్తామని చెప్పారు.

మరిప్పుడు ఐదు నెలల తర్వాత రూ.264 కోట్లు మాత్రమే ఇస్తామంటారేంటి? అంటే కోతకు గురైన రూ.836 కోట్లను ఇంకో నెలలో ఇచ్చేసి మాట నిలబెట్టుకుంటారా అని ప్రశ్నించారు లోకేశ్. టీడీపీ హయాంలోనే 6.49 లక్షల మందికి, రూ.336 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం చేశామని ఆయన గుర్తు చేశారు..

అలాగే వైసీపీ వేసిన కోర్టు కేసుల మూలంగా టీడపీ ఇవ్వలేకపోయిన ఆ రూ.336 కోట్ల నుండే రూ.264 కోట్లు ఇస్తూ ఇంకా రూ.72 కోట్లను మిగుల్చుకున్నారు. వాహ్! జగన్ మోహన్ రెడ్డిగారు ఇంత మాయ చేస్తారు కాబట్టే మీరు గౌరవనీయ ఏ-1 కాగలిగారు అని అన్నారు..