లోకేశ్ వైసీపీ కార్యకర్తలపై సెటైర్స్

లోకేశ్ వైసీపీ కార్యకర్తలపై సెటైర్స్

0
87

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తాజాగా సెటైర్స్ వేశారు… తనకు పేటీఎమ్ బ్యాచ్ ఆవేశం చూస్తే నవ్వొస్తుందని అన్నారు…. అకౌంట్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిల్లర పడితే చాలు ఇంగిత జ్ఞానం లేకుండా రెచ్చిపోతున్నారని లోకేశ్ ఆరోపించారు…

బీజీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కొడుకు రిత్విక్ నాయుడు పెళ్లికి లోకేష్ దుబాయ్ వెళ్లాడు అని 2015లో తాను అమెరికా పర్యటనకు వెళ్లిన పాత ఫొటోలతో కొత్త కథ అల్లుతున్నారని లోకేశ్ ఆరోపించారు…

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్ కి ఐదు రూపాయిలే ఇస్తున్నారటగా కాస్త ఎక్కువ అడగండి స్వామి అని లోకేశ్ ఎద్దేవా చేశారు… జే ట్యాక్స్ కోట్లలో వసూలు చేస్తున్నారు మీకు మాత్రం ఐదు రూపాయిలే వేస్తే ఎలా అని లోకేశ్ ప్రశ్నించారు..