తెలంగాణలో ఒంటిపూట బడులు..ఎప్పటి నుంచి అంటే?

0
118

తెలంగాణలో వేసవి దృష్ట్యా ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 23 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కపూట బడులు నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12:00 వరకు బడి వేళల నిబంధనలను పెట్టింది. అయితే ఇక జూన్ 12వ తేదీ నుండి నూతన అకాడమిక్ విద్యా సంవత్సరం మొదలు కానుంది.