పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావ్ – బండ్ల గణేష్

0
128

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ..బండ్ల గణేష్ వరుస ట్వీట్లతో  విజయసాయికి  తిట్ల పురాణాన్ని రుచి చూపిస్తున్నాడు. మీకు కులం నచ్చకపోతే, కమ్మవాళ్లు నచ్చలేదంటే నేరుగా తిట్టoడి. అంతే కానీ చంద్రబాబును, టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మవారిని తిట్టకండి అని హెచ్చరించారు. అధికారం ఎప్పటికి శాశ్వతం కాదని , రేపు నువ్వు కూడా మాజీవి అవ్వక తప్పదని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ప్రతి కమ్మవారు తెలుగుదేశం కాదు. నేను కమ్మవాణ్ణే కానీ టీడీపీ కాదు అంటూ ఇద్దరి మధ్య ట్వీట్ వార్ జరిగింది.

ఆంధ్రాకి పట్టిన అష్ట దరిద్రమా, నీ పిచ్చికి, నీ కుల పిచ్చికి నీ డబ్బు పిచ్చికి కమ్మ కులాన్ని బలిచేయాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది అంటూ తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబుతో ఏమైనా విభేదాలు ఉంటే ఆయనతో డైరెక్ట్ గా తేల్చుకో, విశాఖలో దోచుకున్న డబ్బుతో హైదరాబాద్ కొనుక్కో అంతేగాని కులాన్ని విమర్శించడం నీకు తగదని ట్వీట్ లో తెలియజేసాడు. వ్యక్తిమీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పు దెబ్బరుచి చూపిస్తారని తెలిపారు. టీడీపీ కులపార్టీ అయితే మీరెందుకు కమ్మవారికి టికెట్ ఇచ్చారని నిలదీశాడు. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టాలని చూస్తున్నావు. అది మీకు మంచిది కాదని హితబోధ చేసాడు.