అతడు నిజంగా లక్కీ పర్సన్ అనే చెప్పాలి. ఎందుకు అంటే అతను పోగొట్టుకున్న లాటరీ టికెట్ అతనికి మళ్లీ దక్కింది.. ఇది నిజంగా అతనికి ఎంత లక్ ఉందో నిరూపిస్తుంది..ఆ లాటరీ టికెట్ విలువ అక్షరాల రూ.8కోట్లు. ఇక్కడ ఓ విషయం అసలు లాటరీ తగలడం లక్ అని అనుకుంటాం.. కాని ఆ టికెట్ పొగొట్టుకుని మళ్లీ సాధించుకున్నాడు ఇది వండర్ అంటున్నారు అందరూ.
ఈ స్టోరీ ఏమిటో చూద్దాం..అమెరికాలోని టేనస్సీ రాష్ట్రానికి చెందిన నిక్ స్లాటెన్ మార్చి 10న డ్రింక్ తాగేందుకు గ్రాసరీ స్టోర్ కి వెళ్లాడు. అక్కడ లాటరీ టికెట్ కొన్నాడు, ఇక ఆ లాటరీ టికెట్ కు ఫ్రైజ్ మనీ తగిలింది, దాదాపు 8.5 కోట్ల మనీ గెలుచుకున్నాడు, కాని ఆ లాటరీ టికెట్ ఇంట్లో ఎక్కడ పెట్టాడో కనిపించలేదు. ఇంటి దాకా వచ్చిన అదృష్టం వెనక్కి వెళ్లిపోయింది అని బాధపడ్డాడు.
మొత్తం ఇళ్లు అంతా వెతికారు చివరకు పార్కింగ్ ఏరియాలో తన కారు పక్కనే ఉన్న మరో కారు దగ్గర నేల మీద పడున్న లాటరీ టికెట్ కనిపించింది. ఇక అతనికి ఆనందం మాములుగా రాలేదు, ఇక వెంటనే దానిని తీసుకుని లాటరీ వారి దగ్గరకు వెళ్లాడు. అయితే ఈనగదుతో ఓ మంచి ఇళ్లు కొనుక్కుంటాను అని చెబుతున్నాడు ఆ వ్యక్తి. నిజంగా అతను చాలా లక్కీ కదా .
ReplyForward
|