లాస్ట్ లో కేసీఆర్ పంచ్ అదిరింది – కేసీఆర్ సీరియ‌స్ వార్నింగ్

లాస్ట్ లో కేసీఆర్ పంచ్ అదిరింది - కేసీఆర్ సీరియ‌స్ వార్నింగ్

0
79

తెలంగాణ‌లో లాక్ డౌన్ మే 31 వ‌ర‌కూ కొన‌సాగుతుంది, అయితే కొన్ని స‌డ‌లింపులు అయితే సీఎం కేసీఆర్ ఇచ్చారు, కేంద్రం ప్ర‌క‌టించిన ప్యాకేజీ వ‌ల్ల ఏ ఉప‌యోగం లేదు అని విమ‌ర్శ‌లు చేశారు, రాష్ట్రాలు ఇంత ఇబ్బందిలో ఉంటే ఇదేనా పాటించే విధానం అని అన్నారు, ఇక పారిశ్రామిక వేత్త‌లు త‌మ కంపెనీలు తెర‌చుకునేందుకు ఉద్యోగుల‌కి అనుమ‌తి కోరారు.

దీంతో మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్,పరిశ్రమలు 100శాతం ఉద్యోగులతో కార్యకలాపాలు చేసుకోవ‌చ్చు అన్నారు కేసీఆర్, అలాగే గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసులు ప్రైవేట్ ఆఫీసులు తెర‌చుకుంటాయి.. రాష్ట్రంలో అన్నీ చోట్లా సెలూన్ లు తెర‌చుకోవ‌చ్చు…బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ తప్పనిసరి అని.. లేకపోతే రూ.1000 జరిమానా అని తెలిపారు.

ఇక ఇప్ప‌టికే కొద్దిగా స‌డ‌లింపుల‌కే పెద్ద ఎత్తున జ‌నం రోడ్ల‌పైకి వ‌స్తున్నారు, ఈ స‌మ‌యంలో మ‌రోసారి స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో ,అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి వ‌చ్చి హంగామా చేస్తే మ‌ళ్లీ కేసులు పెరిగితే, మ‌ళ్లీ పూర్తి లాక్ డౌన్ పెంచే అవ‌కాశం ఉంది, అందుకే ప‌నిలేక‌పోతే రోడ్ల‌పైకి రాకండి అని తెలిపారు కేసీఆర్..
అన్ని రకాల విద్యా సంస్థలు మే 31 వరకు మూసివేయాల్సిందేనని చెప్పారు. సినిమాహాళ్లు, ఫంక్ష‌న్ హ‌ల్స్, స్పోర్ట్ క్ల‌బ్స్, ప‌బ్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంటాయి తెలంగాణ‌లో.. ఇక వృద్దులు చిన్న‌పిల్ల‌ల‌ను ఎట్టి ప‌రిస్దితిలో బ‌య‌ట‌కు తీసుకురాకండి అని అన్నారు.