ప్రియురాలి కోసం ప్ర‌పంచంలో ఖ‌రీదైన గిఫ్ట్ ఇచ్చిన అమెజాన్ అధినేత‌

ప్రియురాలి కోసం ప్ర‌పంచంలో ఖ‌రీదైన గిఫ్ట్ ఇచ్చిన అమెజాన్ అధినేత‌

0
78

అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రు అమెజాన్ కంపెనీని సూప‌ర్ స‌క్సెస్ గా తీసుకువెళుతున్న కంపెనీ అధినేత‌, తాజాగా ఆయ‌న ప్రేయ‌సి కోసం అతిఖ‌రీదైన ఎస్టేట్ తీసుకున్నార‌ట‌
కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో 165 మిలియన్ డాలర్లు అంటే మ‌న ఇండియ‌న్ క‌రెన్సీలో రూ.1200 కోట్ల విలువ చేసే వార్నర్ ఎస్టేట్ ను అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కొనుగోలు చేశారు.

అయితే అత్యంత ఖ‌రీదైన నివాసంగా దీనిని చెబుతారు.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇందులో హాలీవుడ్ నిర్మాత డేవిడ్ గిఫెన్ ఉండేవారు.. ఆయ‌న బెజోస్ కు అమ్మేశారు.. అత్యంత ఖ‌రీదైన ఇళ్లు ఇదే అని చెబుతున్నారు. మొత్తం ఈ ఖ‌రీదైన ఈ ఇళ్లు 10 ఎక‌రాల విస్తీర్ణంలో ఉంది.

భార్యకు విడాకులు ఇచ్చిన అమెజాన్ సీఈవో బెజోస్ తన ప్రియురాలితో కలిసి కొత్త ఇంటి కోసం అన్వేషించినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అందులో భాగంగా దాదాపు మూడు నెల‌లుగా మంచి ప్రాపర్టీ చూసుకుని చివ‌ర‌కు దీనిని తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.