అదృష్టం కొందరికి ఇంటి మెయిన్ డోర్ తలుపు తట్టి మరీ వస్తుంది, ఇది కూడా అలాంటిదే చాలా మంది లక్కీ డ్రా గెలుస్తూ ఉంటారు కొందరు లాటరీ గెలుస్తూ ఉంటారు, అయితే ఒకేసారి 160 లాటరీలు గెలవడం అంటే అది మాములు విషయం కాదు
వర్జీనియాకు చెందిన ఓ వ్యక్తిని లక్ ఇలాగే వరించింది.
డమ్ఫ్రయిస్కు చెందిన క్వామే క్రాస్ అనే వ్యక్తి.. 160 లాటరీ టికెట్లు కొన్నాడు. అన్ని టికెట్లలో 7314 నెంబర్లు ఉండేలా చూసుకున్నాడు. అన్నీ సిరిస్ లో తానే ఫ్రైజ్ గెలిచాడు, మొత్తం అతనికి అన్నీ కలిపి సుమారు 6 కోట్ల రూపాయల వరకూ లాటరీ వచ్చింది.
అయితే ఇది నిజమా కాదా అని ఏకంగా అన్నీ టికెట్లు కలిపి ఆరు గంటల పాటు చెక్ చేసుకున్నాడు.. ప్రతీ టికెట్ నెంబర్ కలిపి దాదాపు 80 సార్లు చూసుకున్నాడట, ఇలా చూసి అతను షాక్ అయ్యాడు, నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉంది అంటూ తెలిపాడు క్వామే క్రాస్…గతంలో రేమాండ్ హర్రింగ్టన్ అనే వ్యక్తి ఒకేసారి 25 లాటరీ టికెట్లు గెలుచుకుని 1.25 లక్షలు డాలర్లు గెలుచుకుని ఆశ్చర్యపరిచాడు. ఇప్పడు ఈ రికార్డు బ్రేక్ చేసి 160 లాటరీలు గెలుచుకున్నాడు.