లాటరీ పేరు చెప్పగానే ముందు మనకు గల్ఫ్ దేశాల్లో నిర్వహించే లాటరీలు గుర్తు వస్తాయి… ముఖ్యంగా మన దేశం నుంచి అక్కడ ఉద్యోగ వ్యాపారాల కోసం వెళ్లిన వారికి కోట్ల రూపాయల జాక్ పాట్ లాటరీలు చాలా తగిలాయి,.ముఖ్యంగా ఏపీ తెలంగాణ కేరళ గుజరాత్ ఈ ప్రాంతాల నుంచి వెళ్లిన చాలా మంది అక్కడ లాటరీ టికెట్ కొని గెలుపొందారు.. వారికి చాలా సార్లు కోట్ల రూపాయల లాటరీలు తగిలాయి.
తాజాగా కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతానికి చెందిన శివమూర్తి కృష్ణప్ప అనే వ్యక్తి ఏకంగా రూ.24 కోట్ల బంపర్ లాటరీ గెలుచుకున్నాడు. శివమూర్తి కృష్ణప్ప ఓ మెకానికల్ ఇంజినీరు. యూఏఈలో అతను వర్క్ చేస్తున్నాడు.. తాజాగా అతను కొన్న లాటరీ టికెట్ కి ప్రధమ ప్రైజ్ మనీ వచ్చింది… ఇది మన కరెన్సీలో 24 కోట్లు దీంతో అతను చాలా ఆనందంలో ఉన్నాడు.
అతను గత మూడు సంవత్సరాలుగా ఇలా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నాడు, మొత్తానికి ఇప్పుడు తనకు లాటరీ తగిలింది అని చాలా ఆనందంలో ఉన్నాడు.. ఇక సొంత ఊరులో ఇళ్లు కట్టుకుంటాను చిన్న వ్యాపారం పెట్టుకుంటాను.. పిల్లలని బాగా చదివించి భవిష్యత్ అవసరాలకు ఈ నగదు వాడుకుంటాను అని చెబుతున్నాడు ఆ వ్యక్తి.