ఒక్కోసారి అదృష్టం ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేము.. అప్పటి వరకూ ఎన్నో ఆర్ధిక ఇబ్బందులున్న వారికి లక్ష్మీ కటాక్షం వస్తూ ఉంటుంది ..ఒక్కసారిగా వారి లైఫ్ మారిపోతుంది. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే జరిగింది..కర్ణాటకలోని మాండ్యాకు చెందిన సోహన్ బలరాంని చూసి అందరూ లక్కీ పర్సన్ అంటున్నారు…ఇక అతనిపేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.
అతను లాటరీలో కోటి రూపాయలు గెలుచుకోవడంతో కుటుంబం చాలా ఆనందంలో ఉన్నారు, అయితే ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ విషయం ఏమిటి అంటే అతను కావాలి అని ఈ లాటరీ కొనుగోలు చేయలేదు, ఇటీవల కేరళకు వెళ్లాడు తన మిత్రుడ్ని కలవాలి అని….ఈ సమయంలో ఇంటికి వచ్చేస్తున్న సమయంలో.
స్నేహితులు దారిలో లాటరీ టికెట్లు కనిపిస్తే కొనమని బలవంతం చేశారు. దీంతో ఇంట్రస్ట్ లేకపోయినా 100 పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు… దీంతో అతను కొన్న లాటరీ టికెట్ కి కోటీ రూపాయలు మనీ వచ్చింది…వెంటనే లాటరీ వారు ఫోన్ చేసి ఈ విషయం అతనికి చెప్పారు, ఇక ఈ మాటవిన్న తర్వాత అతని ఆనందానికి అవదుల్లేవు.