ఎన్నికల హామీలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన వెంటనే రంగంలోకి దిగుతాయి, ఇది కూడా అలాంటిదే మన దేశంలో జార్ఖండ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజలకు ఓ తీపి వార్త చెప్పింది.. పేదల కోసం రాష్ట్రంలో సరికొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
బీద వారికి ఆ కుటుంబాలకి పది రూపాయలకు ధోతి లేదా లుంగీ, రూ.10కే చీరను అందజేయనున్నట్లు తెలిపింది. అంటే రూ.20కే ధోతి, చీర రెండు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇది సంవత్సరానికి రెండు సార్లు తీసుకోవచ్చు, అంతేకాదు ఏడాది పాటు ఇది అమలు చేస్తున్నారు.
ఇక దీనిపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటన చేశారు.ఆరు నెలలకు ఒకసారి దుస్తులు అందజేయనున్నట్లు జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హేమంత్ సోరెన్ నాయకత్వంలోని జేఎంఎం పార్టీ రాష్ట్ర ప్రజలకు
ఇలా తక్కువ ధరకు బట్టలు ఇస్తాము అని చెప్పింది, ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటున్నారు అక్కడ సీఎం, కేవలం నిరుపేదలకు మాత్రమే.. వారు దీనిని ఉపయోగించుకోండి అని తెలిపారు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్