మా లక్ష్యం అదే…. కేటీఆర్

మా లక్ష్యం అదే.... కేటీఆర్

0
89
KTR

పెరుగుతున్న జనాభా అవసరాలమేరకు 30 ఏళ్ల ప్రణాళికతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టామని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు… శాతవాహన వర్సిటీలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను తాజాగా ఆయన ప్రారంభించారు.. రాష్ట్ర గ్రామీణ ప్రజల జీవితాలను బలోపేతం చేయటమే ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు కేటీఆర్..

కరీంనగర్ లో ఏపని ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుందని అన్నారు… తాగు సాగు నీరు విద్యుత్ ఇబ్బందులను తక్కువకాలంలో అధిగమించామన్నారు..కేవలం మూడేళ్లవ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేశామని అన్నారు… ఒక్కో పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు…

అందరకి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నమని భవిష్యత్ లో తరాలు బాగుండాలని 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం అని కేటీఆర్ తెలిపారు.. త్వరలోనే తీగవంతేన పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని కరీంనగర్ కొత్త శోభను తీసుకువచ్చేలా జంక్షన్ వచ్చేలా రూపొందించాలని కేటీఆర్ తెలిపారు..