మదనపల్లెలో ఇద్దరు కుమార్తెలను దారుణంగా హత్య చేసిన కేసులో తల్లి పద్మజ మదనపల్లె సబ్ జైలులో ఉంది, అయితే ఆమె విచిత్రమైన ప్రవర్తణకు డాక్టర్లు పోలీసులు కూడా షాక్ అవుతున్నారు… ఇక నేనే శివుడ్ని నా నుంచి కరోనా వచ్చింది ఇలా అనేక మాటలు ఆమె మాట్లాడింది. ఇవన్నీ కూడా వీడియోలలో చూశాం.
ఇక మళ్లీ జైలులో ఆమె ఇలాంటి ప్రవర్తనే ప్రవర్తించిందట.. నిందితురాలు పద్మజ తోటి ఖైదీలను మళ్లీ హడలుగొట్టింది. నేనే శివుడిని నన్నే లోపల వేస్తారా?’ అంటూ వీరంగమేసింది. గట్టిగా శివ శివ అంటూ అరుపులు అరిచింది దీంతో తోటి ఖైదీలు హడలిపోయారు.
రాత్రంతా ఆమె కేకలు వేయడంతో ఖైదీలు జాగారం చేయాల్సి వచ్చింది. ఇక వారికి ట్రీట్మెంట్ అందించాలి అంటున్నారు వైద్యులు… ఇక వీరిని విశాఖలోని మానసిక వైద్యశాలకు తరలించనున్నారు. ఇక తండ్రి మాత్రం కుమార్తెలను తలచుకుని కన్నీరు మున్నీరు అవుతున్నాడట.