ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసు ఎంత సంచలనం అయిందో తెలిసిందే..
ఈ కేసులో నిందితులైన పురుషోత్తంనాయుడు, పద్మజలను విశాఖపట్నం మానసిక వైద్యశాలకు తరలించిన విషయం తెలిసిందే.. తాజాగా వారిని అక్కడ నుంచి డిశ్చార్జ్ చేశారు..ఈ విషయాన్ని విశాఖపట్నం మానసిక వైద్యశాల అధికారులు వెల్లడించారు.
గత నెల నాలుగో తేదీ నుంచి చినవాల్తేరులో గల ప్రభుత్వ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.. ఇక వీరు చికిత్స పొంది సాధారణ స్దితిలోకి చేరుకున్నారు…. వీరిని మళ్లీ మదనపల్లె జైలుకి తరలిస్తున్నారు.. ఇద్దరు కుమార్తెలని హతమార్చి వారు మళ్లీ బతుకతారు అనే మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చిగా ప్రదర్శించారు ఈ తల్లిదండ్రులు.
కన్న కూతుళ్ల హత్య కేసులో ఆ తల్లిదండ్రులు పశ్చాత్తాప పడుతున్నట్లు వైద్యులు తెలిపారు.జనవరి 24న తమ కన్నబిడ్డలైన అలేఖ్య, సాయిదివ్యను హత్య చేసిన ఘటన ఎవరూ మర్చిపోలేరు… ఇంత ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తూ దారుణంగా ఈ మూఢనమ్మకాల్లో మునిగిపోయారు ఈ తల్లిదండ్రులు.
.
ReplyForward
|