కేసీఆర్ – అక్బరుద్దీన్ ఓవైసీ పై మాధవీలత సంచలన పోస్ట్

కేసీఆర్ - అక్బరుద్దీన్ ఓవైసీ పై మాధవీలత సంచలన పోస్ట్

0
112

పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం అందరికి తెలిసిందే ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఆలయం, అయితే ఇక్కడ రాజ్యం అంతా ఓవైసీ సోదరులదే అని అంటారు, ఇక్కడ గెలుపు కూడా వారి కుటుంబాలకే ఉంటుంది.
మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి నిధులను కోరుతూ, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు, రాజకీయ నేతలు అన్ని కులాలు మతాలను సమానంగా చూడాలి ఈ లెక్కలో ఆయన కూడా గుడికి నిధులని కోరారు.

ఆ వెంటనే నిధులను మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్ వ్యాఖ్యానించారు, దీనిపై చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు, తాజాగా బీజేపీ నాయకురాలు సినీ నటి మాధవీలత సంచలన కామెంట్స్ చేశారు.మార్పు మొదలైంది. మోడీ గారు ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపితమయింది.. అయ్యబాబోయి, మొన్న జాతీయ జెండాలు పట్టుకున్నారు.

నిన్న జనగణమన పాడారు. నేడు గుడులు బాగుచేయాలంటున్నారు. మోడీ, నువ్వు సామాన్యుడివి కాదయ్యా…
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకడు, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కోరారు అని అన్నారు. దీనిపై చాలా మంది పాజిటీవ్ గా స్పందిస్తున్నారు.