మధ్యప్రదేశ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన శివరాజ్‌సింగ్ ..మొద‌టి ప‌ని ఇదే

మధ్యప్రదేశ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన శివరాజ్‌సింగ్ ..మొద‌టి ప‌ని ఇదే

0
109

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కింద‌కి వ‌చ్చింది.. బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది..స్టేట్ లోని అనూహ్య పరిణామాల మధ్య ఆ పార్టీ సీనియర్ నేత శివరాజ్‌సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ లాల్జీ టాండన్ రాజ్‌భవన్‌లో ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఇక సీఎంగా చాలా అనుభ‌వం ఉంది శివ‌రాజ్ సింగ్ కు.

శివ‌రాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది నాలుగోసారి. 2005, 2008, 2013లో సీఎంగా ఆయ‌న పనిచేశారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చాలా సింపుల్ గా జ‌రిగింది. కేవ‌లం కొద్ది మంది ప్ర‌ముఖులు పార్టీ నాయ‌కుల మ‌ధ్య ఈ కార్య‌క్ర‌మం పూర్తి చేశారు.

పార్టీ సీనియర్ నేతలైన అరుణ్‌ సింగ్, వినయ్‌ సహస్రబుద్దే ఇలా నాయ‌కులు అంద‌రూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రమాణ స్వీకారాన్ని చూశారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివరాజ్‌సింగ్‌కు ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ నేత‌లు అంద‌రూ శుభాకాంక్షలు తెలిపారు. ముందు ఆయ‌న సీఎం అయిన వెంట‌నే స్టేట్ లోని అధికారులు అంద‌రితో క‌రోనా గురించి తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌ల గురించి స‌మావేశం ఏర్పాటు చేశారు.