అత్యవసర వైద్య సేవలు అందించే ఎమర్జెన్సీ సర్వీసు వాహనాలు అంటే వెంటనే అంబులెన్స్ అనే చెబుతాం ప్రాణాలను రక్షిస్తారు వారు.. ఎలాంటి సీరియస్ కండీషన్లో ఉన్నా వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకువెళతారు… అయితే వారిని మాఫియా గ్యాంగులు బెదిరిస్తున్నాయి…అంతేకాదు సైరెన్ వేసుకుని వెళితే చంపేస్తాము అని బెదిరిస్తున్నారు… మరి ఇది ఎక్కడ ఎందుకు అనేది చూద్దాం.
ఇది ఇటలీలో జరిగింది…ఇటలీలోని నేపుల్స్‌లో మాఫియా కార్యకలాపాలు ఎక్కువగా సాగుతుంటాయి.
వీరు స్మగ్లింగ్ కిడ్నాపులు ఎక్కువగా చేస్తూ ఉంటారు… అయితే ఇటీవల కోవిడ్ కేసులు పెరగడంతో ఇక్కడ అంబులెన్స్ లు ఎక్కువ సంఖ్యలో తిరుగుతున్నాయి పేషెంట్లని తీసుకుని , దీంతో ఈ మాఫియాలకు పోలీసులు వస్తారు అనే భయం వేసి ఆ సైరన్ ఆపాలి అని వారిని బెదిరిస్తున్నారు… దీని వల్ల వారు డిస్ట్రబ్ అవుతున్నారట…
ఆ సైరన్ సౌండ్ విని పోలీసులు వచ్చేస్తున్నారనే భయంతో పరుగులు తీస్తున్నారట. మరోసారి సైరన్ వేస్తే చంపేస్తాము అని ఆయుదాలతో బెదిరిస్తున్నారు, దీంతో డ్రైవర్లు మాకు పోలీసులు ఎస్కార్టుగా ఉండాలి అని కోరుతున్నారు.