మెగాస్టార్ సినిమాలో తనయుడు చరణ్

మెగాస్టార్ సినిమాలో తనయుడు చరణ్

0
139

మెగాస్టార్ చిరు కొత్త సినిమా స్టార్ట్ అవుతున్న సంగతి తెలిసిందే.. సైరా తర్వాత ఆయన చేస్తున్న చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా, అయితే తాజాగా ఈ సినిమా గురించి కొత్త వార్త వినిపిస్తోంది, ఇందులో మెగాస్టార్ చిరు తనయుడు చరణ్ నటిస్తున్నారట, తాజాగా టాక్ వినిపిస్తోంది టాలీవుడ్ లో, అయితే ఇందులో చిరు యువకుడిగా ఉన్న పాత్రలో చరణ్ చేస్తారట.

ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగులో బిజీగా వున్న చరణ్, ఆ సినిమాలో తన పోర్షన్ షూటింగ్ పూర్తయిన తరువాత ఈ సినిమా సెట్స్ పైకి రానున్నాడని చెబుతున్నారు. అయితే మరో రెండు నెలల్లో ఇది జరుగుతుంది అంటున్నారు…మొత్తానికి మార్చి ఎండ్ లో కచ్చితంగా చెర్రీ నటిస్తారట.

అయితే ఇప్పటికే చిరు, కొరటాల, చెర్రీ కలిసి ఈ సీన్స్ గురించి చర్చించుకున్నారట, 100 రోజుల లోపు ఈ సినిమా పూర్తి చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నారు శివ చిరంజీవి. గతంలో చరణ్ తో సినిమా చేయాలని కొరటాల చేసిన ప్రయత్నాలు కొన్ని కారణాల వలన కుదరలేదు. అయితే ఇప్పుడు చిరంజీవి సినిమాలో చరణ్ నటించడం పై హ్యాపీగా ఉన్నారట దర్శకుడు శివ. మ్యాట్నీ సంస్థవారితో కలిసి చరణ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.