దేశంలో కరోనా సెకండ్ వేవ్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.. ఎక్కడ చూసినా వేలాది కేసులు నమోదు అవుతున్నాయి.. జనవరి నుంచి తగ్గిన కేసులు ఏప్రిల్ నెల నుంచి భారీగా నమోదు అవుతున్నాయి, ఈ వైరస్ కేసులు పెరగడంతో మరణాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి.
మహారాష్ట్ర సర్కార్ తాజాగా ప్రకటించిన సెమీ లాక్డౌన్ 2021, ఏప్రిల్ 14వ తేదీ బుధవారం నుంచి అమల్లోకి రానుంది.
15 రోజుల పాటు కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు చేయనున్నారు..ఇక అత్యవసర సేవలు నిత్య అవసరాలకు మినహాయింపుని ఇచ్చారు. మరోసారి కఠిన ఆంక్షల అమలుకు నిర్ణయం తీసుకున్నామని సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలియచేశారు.
కచ్చితంగా ఈ ఆంక్షలు మే 1 వరకూ అమలు ఉంటాయి… ఇక ప్రజలు బయటకు రావద్దు అని మాస్క్ ధరించే కూరలు నిత్య అవసర వస్తువులు పాలకు రావాలి అని తెలిపారు.అన్నిరకాల ఆఫీసులు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసేయాలి.
మరి రూల్స్ చూద్దాం
ప్రజా రవాణా రైలు సర్వీసులు ఉంటాయి
రాత్రి కర్ఫ్యూ పూర్తిస్థాయిలో ఉంటుంది.
పెట్రోల్ బంకులు గ్యాస్ స్టేషన్ లు బ్యాంకులు పనిచేస్తాయి
10 రూపాయలకు అందించే శివ భోజన్ను ఉచితంగా పంపిణీ చేస్తారు
రేషన్ లబ్ధిదారులకు మూడు కిలోల చొప్పున గోధుమలు, రెండు కిలోల చొప్పున బియ్యం ఉచితంగా ఇస్తారు.
వికలాంగుకలు ఇచ్చే పించన్ విడోలకు ఇచ్చే పించన్ రెండు నెలలు అడ్వాన్స్ ఇస్తారు
కార్మికులకు, లైసెన్సుడ్ ఆటో డ్రైవర్లకు 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం
ఆదివాసీలకు 2 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు.