మహారాష్ట్ర కేరళ ఎందుకు ఇక్క‌డ కేసులు ఎక్కువ కార‌ణం ఇదే ?

మహారాష్ట్ర కేరళ ఎందుకు ఇక్క‌డ కేసులు ఎక్కువ కార‌ణం ఇదే ?

0
94

మ‌న దేశంలో క‌రోనా పాజిటీవ్ కేసులు ఎక్కువ‌గా ఉన్న స్టేట్స్ చూస్తే కేర‌ళ మహారాష్ట్ర , ఇప్ప‌టికే ఇక్క‌డ పాజిటీవ్ కేసులు సంఖ్య మ‌రింత పెరుగుతోంది, దీంతో అక్కడ ప్ర‌జ‌లు అతి జాగ్ర‌త్త‌గా ఉండాలని రోడ్ల‌పైకి రావ‌ద్దు అని ప్ర‌భుత్వం కూడా చెబుతోంది.

మ‌న దేశంలో అత్య‌ధికంగా మహారాష్ట్రలో 203 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేరళలో 180 కేసులు నమోదు అయ్యాయి. ఇవే టాప్ లో ఉన్న స్టేట్స్, గుజరాత్ లో 63 కేసులు, ఢిల్లీలో 72 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

ఇక్క‌డ మ‌ర‌ణాలు ఎక్కువ‌గా ఉండ‌కూడ‌దు అని కేంద్రం ఆలోచిస్తోంది, ఇక్క‌డ‌కు కేంద్రం వైద్య బృందాల‌ని కూడా పంపించింది, అయితే మిగిలిన స్టేట్స్ కంటే ఎక్కువ ఇక్క‌డ ఎందుకు పాజిటీవ్ కేసులు వ‌చ్చాయి అంటే ,మ‌న దేశ ఆర్దిక రాజ‌ధాని ముంబై అది మ‌హారాష్ట్రాలో ఉంది.. పైగా విదేశాల నుంచి ఇక్క‌డ‌కు వ్యాపారాల నిమిత్తం వ‌చ్చేవారు ఎక్కువ‌.

ఇక కేర‌ళ కూడా ఇత‌ర దేశాల వారు ఎక్కువ‌గా వ‌స్తారు.. ఇక్క‌డ నుంచి వేరేదేశాల‌కు ప‌నుల‌కి వెళ్లే కార్మికులు వైద్యులు ఇంజ‌నీర్లు న‌ర్సులు స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు.. ఇలా ప్ర‌యాణాల వ‌ల్ల ట్రావెల్ హిస్ట‌రీ వ‌ల్ల ఇప్పుడు ఈ రెండు స్టేట్స్ లో ఎక్కువ కేసులు న‌మోదు అయ్యాయి.