మహారాష్ట్ర నుంచి మిడతలు వస్తే ఏఏ ప్రాంతాలకు ఎఫెక్ట్

మహారాష్ట్ర నుంచి మిడతలు వస్తే ఏఏ ప్రాంతాలకు ఎఫెక్ట్

0
103

ఈ మిడతలు ఇప్పుడు దేశంలో రైతులని చాలా ఇబ్బంది పాలు చేస్తున్నాయి, ఇప్పుడు ఇవి మహారాష్ట్రాలో ఉన్నాయని అక్కడ నుంచి అవి తెలంగాణ సరిహద్దు జిల్లాలు ఆదిలాబాద్ చేరుకుంటే ఇక తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది అంటున్నారు, ఇప్పుడు పంటలు లేవు కాని మామిడి కూరగాయల పంటలు ఉన్నాయి వాటికి ఎఫెక్ట్ అంటున్నారు.

తాజాగా కుమురం భీం జిల్లా తిర్యాణీ, సిర్పూర్ నియోజకవర్గంలోని ప్రాణహిత ప్రాంతాల్లో మిడతల దండు తిష్ట వేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మిడతలు వాలితే గుడ్లు పెట్టే ప్రమాదం ఉండటంతో.. స్ప్రేయర్లు, ఫైరింజన్లను ఉపయోగించి పెద్ద ఎత్తున రసాయనాలు, వేప నూనెను పిచికారీ చేయనున్నారు

తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మంలోకి ప్రవేశించొచ్చన్నారు. అటు నుంచి రాష్ట్రంలోని గోదావరి జిల్లాలు, ఇతర ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు, వచ్చాయంటే లక్షలు, కోట్లలో వాటి సంఖ్య ఉంటుందన్నారు. డీజే సౌండ్ వల్ల ఈ మిడతలు తట్టుకోలేక చెదిరిపోతాయి అంటున్నారు అధికారులు, వేప నూనెతో పిచికారి చేయాలి అని చెబుతున్నారు.