మహిళా మంత్రులపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది…ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కెబినెట్ లో ముగ్గు మహిళా ఎమ్మెల్యేలు పని చేస్తున్నారు…. వీరిలో ఒకరు డిప్యూటీ సిఎం కూడా ఉన్నారు… హోం మంత్రిగా సుచరితా.. శిశుసంక్షేమ మంత్రిగా వనిత, గిరిజన సంక్షేమ మంత్రిగా డిప్యూటీ సిఎంగా పుష్ప శ్రీవాణి ఉన్నారు… వీరందు సీఎం జగన్ కు అత్యంత ఆత్మీయులుగా ముద్ర వేసుకున్నావారు..
అయితే ప్రస్తుతం కరోనా నేపధ్యంలో ఎవరు ఎంతమేరకు పనిచేస్తున్నారు… ప్రజల్లో వీరి తిరుగుతూ అవగాహణ కార్యక్రమాలు చేస్తున్నారా అనే చర్చ సాగుతోంది…. అందులో ముఖ్యంగా డిప్యూటీ సిఎం పుష్ప శ్రీవాణి పేరు ముఖ్యంగా వినిపిస్తోందట… ఆమె రాజధాని గుంటూరు జిల్లాలో ఉన్నప్పటికీ ప్రజల్లోకి రాకున్నారట…తన కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఉంటున్నారని చర్చించుకుంటున్నారు…
ఏదైనా కార్యక్రమంలో ఉంటే అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారట.. ఇక మంత్రి తానేటి వనిత కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నారని అంటున్నారు.. శిశు సంక్షేమ మంత్రిగా ఉన్నప్పటికీ ఆమె ఎలాంటి కార్యక్రమానికి హాజరు కాలేదని చర్చించుకుంటున్నారు… ఏదో మొక్కుబడిగా మంత్రిహోదాలో కార్యక్రమాల్లో పాల్గొనడం మినహా అమె చేసిందేం లేదనే చర్చ కొనసాగుతోంది…
—