మాజీ మంత్రి మెడకు హత్య కేసు…

మాజీ మంత్రి మెడకు హత్య కేసు...

0
91

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి పెర్నీ నాని కీలక అనుచరుడు మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ మోకా భాస్కరరావును ఇటీవలే కత్తితో పోడిచి చంపిన సంగతి తెలిసిందే… ఈ హత్యపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు… భాస్కరరావు రాజకీయ హత్యేనని నిర్థారించారు..

హత్య కేసులో చింతా చిన్నీ ప్రధాన నిందితుడు కాగా చింతా నాంచారయ్య చింతా కిషోర్ లను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు… కాగా భాస్కరరావు హత్య మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతో జరిగిందంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు… వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు..

చింతా కిషోర్ చింతా నాంచారయ్యతోపాటు కొల్లు రవీంద్రను కూడూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు… ఈ కేసు విచారణలో భాగంగా మరికొంతమంది అనుమానితులను అదుపులో తీసుకున్నామని పోలీసులు తెలిపారు.. కాగా మాజీ మంత్రిపై కూడా ఆరోపణలు రావడంతో ఆ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని భావిస్తున్నారు..