ఈసారి జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి కవిత ఓటమి పాలయ్యారు, అయితే పార్టీ తరపున కార్యక్రమాల్లో యాక్టీవ్ గా ఉన్న ఆమెకు ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్ , రాజ్యసభ పదవి ఇస్తారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజ్యసభకు వెళ్లడం దాదాపు ఖాయమైందని టీఆర్ ఎస్ శ్రేణులు గత మూడు నెలలుగా చర్చించుకుంటున్నారు.. త్వరలో ఖాళీ అయ్యే రెండు స్ధానాల్లో ఆమెకి ఓ సీటు ఇస్తారట.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 7, ఆంధ్రప్రదేశ్ కు 11 రాజ్యసభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తెలంగాణలో రెండు స్ధానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో మాజీ ఎంపీ కవితకు రాజ్యసభ సీటు ఇస్తారట. వీరికి ఏప్రిల్ 9 వరకూ సమయం ఉంది. ఈ లోపే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ ముగించనుంది..నిజామాబాద్ మాజీ ఎంపీ కవితకు ఈ పదవి ఇవ్వాలి అని కోరడానికి గల కారణాలు కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. తెలుగు, హిందీ, ఆంగ్ల, ఉర్దూ భాషలపై ఆమెకు చాలా పట్టు ఉంది, నేతలు అధికారులు, ప్రజలతో చాలా చొరవ ఉండటం. గతంలో ఆమె ఎంపీగా పనిచేయడం, హస్తినలో పెద్దలతో పార్టీ పనులు ప్రభుత్వ పనులు చేయించడంలో అనుభవం ఉండటంతో కవితకే సీటు అని అంటున్నారు.
పైగా ఆమె ఓటమి చెందినా రాజకీయాల్లో ఇవన్నీ మాములే అని చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు.. తన కేడర్ ని జిల్లా టీఆర్ ఎస్ నేతల్ని ఓ తాటిపై తీసుకువచ్చి నడిపిస్తున్నారు, జిల్లా నాయకులు కూడా కేసీఆర్ ని కలిసిన సమయంలో, ఆమెని రాజ్యసభకు పంపాలి అని కోరుతున్నారట, దీంతో కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత దీనిపై ప్రకటన చేస్తారు అని తెలుస్తోంది.