రాజకీయాల్లో ఆయన ట్రబుల్ షూటర్ ..ఓ గొప్ప రాజకీయ దిగ్గజం..భారత మాజీ రాష్ట్రపతి, ప్రణబ్ ముఖర్జీ నిన్న కన్నుమూశారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అదిరోహించారు, గుమస్తా నుంచి దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవి కూడా ఆయన చేశారు.
అయితే ఆయన మరణానికి కారణం ఏమిటి అనేది తాజాగా వైద్యులు చెబుతున్నారు.. ఆయనకు ఎనభై నాలుగేళ్ళు… ఈ రాజకీయ కురువృద్ధుడు కొవిడ్-19 పాజిటివ్ కి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆర్మీ హాస్పిటల్ లో చేరారు. అయితే ఈ సమయంలో ఆయనకు బ్రెయిన్ సర్జీరీ చేశారు, ఇక్కడ బ్లడ్ క్లాట్ అవ్వడంతో సర్జరీ చేశారు, కాని తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది..అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్ పైనే ఉన్నారు.
బ్రెయిన్ లో ఏర్పడిన బ్లడ్ క్లాట్ నే స్ట్రోక్ అని కూడా అంటారు. దీన్నే బ్రెయిన్ అటాక్ అని కూడా అంటారు.
ఇక బ్రెయిన్ లో జరగాల్సిన రక్తప్రసరణ సరిగ్గా జరగకపోతే ఈ సమస్య వస్తుంది, వారికి కళ్లు సరిగ్గా కనపించవ, మాట సరిగ్గా రాదు, నడవలేరు, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యతో ఆయన బాధపడ్డారు.