ఓటు వేసే వారికి ప్రతీ ఒక్కరికి ఓటర్ కార్డ్ ఉండాల్సిందే.. అయితే ఇది మనం తీసుకున్న సమయంలో ఒక్కోసారి తప్పులు కూడా నమోదు అవుతాయి.. పేరు ఇంటి అడ్రస్ వయసు ఇలా చాలా తప్పులు ఉంటాయి.. మరి వాటిని ఎలా సరిచేసుకోవాలి అని చాలా మందికి తెలియదు.. అయితే దీనికి సంబంధించి మీరు ఇంట్లో ఉండి ఈ తప్పులు సరిచేసుకోవచ్చు మరి ఎలా అనేది చూద్దాం.
https://www.nvsp.in/ ఈ వెబ్ సైట్ లో మీ ఓటర్ ఐడీ కార్డులోని తప్పుల్ని సులువుగా సరిచేసుకోవచ్చు.
https://www.nvsp.in/ ఈ వెబ్ సైట్ లింక్ ఓపెన్ చేయండి.
ఇక హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ
హోమ్ పేజీలో ఎడమవైపు Login/Register పైన క్లిక్ చేయండి.
మీరు పాత యూజర్ అయితే మీరు మీ డీటెయిల్స్ తో లాగిన్ అవ్వచ్చు
లేదు మీరు కొత్త యూజర్ అయితే రిజిస్ట్రర్ అని ఓపెన్ చేయండి
మీ మొబైల్ నెంబర్ లేదా మీ మెయిల్ ఐడీతో దీనిని ఓపెన్ చేయండి
ఇక మీకు కొత్త అకౌంట్ వస్తుంది
ఇక కొత్త అకౌంట్ తో మీరు అకౌంట్ ఓపెన్ చేయండి
లాగిన్ చేసిన తర్వాత Click on Correction in Personal Details పైన క్లిక్ చేయండి.
ఇక మీరు ఏ స్టేట్ జిల్లా మీ మండలం నియోజకవర్గం అక్కడ సెలక్ట్ చేసుకోవాలి
ఉదాహరణ
ఏపీ
కర్నూలు జిల్లా
శ్రీశైలం ఇలా సెలక్ట్ చేసుకోవాలి
అక్కడ మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు
అయితే మీరు ఏది అయితే మార్చాలి అని అనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు డాక్సుమెంట్లు అప్ లోడ్ చేయాలి
ఇవన్నీ అయిన తర్వాత మీకు రిఫరెన్స్ ఐడీ వస్తుంది.
ఈ ఐడీతో మీరు మీ స్టేటస్ తెలుసుకోవచ్చు
మీకు అప్ డేట్ కూడా అందులో ఇస్తుంది
రిజెక్ట్ అయితే కారణం కూడా తెలియచేస్తారు