మలాలాకి మరో ఘనత అసలు ఆమె ఎవరో తెలుసా

మలాలాకి మరో ఘనత అసలు ఆమె ఎవరో తెలుసా

0
92

ప్రపంచంలో అందరికి తెలిసిన వ్యక్తి అంటే మలాలా అనే చెప్పాలి, ఆమె గురించి ప్రపంచం మాట్లాడుకున్న సంగతి తెలిసిందే… నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పాకిస్తాన్కు చెందిన మలాలా యూసఫ్ జాయ్ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఆమె ప్రపంచ ప్రఖ్యాత టీనేజ్ యువతిగా గుర్తింపు పొందింది. 21వ శతాబ్ధపు రెండవ దశకంలో ఫేమస్ టీనేజర్గా మలాలా నిలిచినట్లు.. ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 2010 నుంచి 2019 మధ్య కాలంలో మలాలాకు వచ్చిన గుర్తింపు ఆధారంగా యూఎన్ ఈ విషయాన్ని వెల్లడించింది.

ఆమె గతంలో పాకిస్తాన్లోని బాలికల విద్య కోసం ఎంతో కష్టపడింది.. పాక్ లోని తాలిబన్ల అకృత్యాలపై పోరాడింది. దీని కై ఆమె సేవకు గుర్తింపుగా 2014లో నోబెల్ శాంతి బహుమతి వరించింది. 2017లో యూఎస్ శాంతిదూతగా కూడా మలాల నిలిచారు. ప్రపంచంలో అత్యంత చిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తిగా పాకిస్తాన్ బాలిక మలాలా యూసఫ్జాయ్ చరిత్ర సృష్టించింది.

భారత్ కు చెందిన వ్యక్తి కైలాశ్ సత్యార్థితో పాటు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి అందుకుంది. అప్పట్లో మలాలపై జరిగిన హత్యాయత్నం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలను రేపింది. ఈ అమానవీయ ఘటనపై నిరసనలు చెలరేగాయి. 2012లో మానవ హక్కుల రోజు సందర్భంగా యునెస్కో మలాలాకు ప్రత్యేక అభినందనలు తెలిపింది. పాక్ లో ఉగ్రవాదులు ఆమెని హింసించారు బాలికల చదువుకై పోరాటం చేసిన ఆమెపై బులెట్లు కురిపించారు చివరకు ఆమెకు వెన్నముకలో ఉన్న బులెట్ తీసి ప్రాణాలు కాపాడారు ఏడు గంటల పాటు ఆమె చికిత్స తీసుకున్నారు, ఇది అందరిని కలిచివేసిందది