మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిన వినోద్

మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిన వినోద్

0
86

మున్సిపల్ పోరు రాజకీయాలని మార్చేస్తోంది తాజాగా మాజీ మంత్రి గడ్డం వినోద్ మళ్లీ ఆయన పాత గూటికి చేరిపోయారు.. కాంగ్రెస్ గూటికి చేరారు ఆయన.. ముందు కాంగ్రెస్ లో ఉన్న వినోద్ తెలంగాణ ఉద్యమం సందర్భంగా 2013లో టీఆర్ఎస్ లో చేరారు… తర్వాత ఏడాదిలో తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు. 2016లో మళ్లీ టీఆర్ఎస్ లోకి వెళ్లారు.

ఇక మళ్లీ అసెంబ్లీ, సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా చెన్నూరులో పోటీ చేసి ఓటమి పొందిన విషయం తెలిసిందే. ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఆర్సీ కుంతియా, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో వినోద్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు.

ఆనాడు కాంగ్రెస్ పార్టీని వీడాను కాని తప్పు చేశాను మళ్లీ నా పార్టీలోకి రావడం చాలా ఆనందంగా ఉంది అన్నారు ఆయన
కొన్ని పొరపాట్ల వల్ల పార్టీ మారాల్సి వచ్చింది. 35 ఏళ్ల నుంచి కాంగ్రెస్ తో అనుబంధం ఉంది. కాంగ్రెస్ మా సొంత పార్టీ. మా నాన్న వెంకటస్వామి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చా అన్నారు, ఇక నా సోదరుడు బీజేపీలో ఉండటం ఆయన ఇష్టం అని తెలిపారు ఆయన.