బంగారం ధర భారీగా పెరుగుతోంది.. గడిచిన వారం రోజులుగా ఇదే హై రేట్ లో కదులుతోంది… దాదాపు రెండు రోజులుగా బంగారం ధర ఇలాగే ఉంది.. ఇక వెండి ధర మళ్లీ పెరిగింది…అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా కూడా దేశీయ మార్కెట్‌లో పసిడి ధర తగ్గుతూ పెరుగుతోంది.
ఇక హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.20 పెరిగింది…దీంతో ధర రూ.46,180కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.20 పెరుగుదలతో రూ.50,390కు పెరిగింది.
ఇక బంగారం ధర ఇలా ఉంటే వెండి ధర కూడా ఇలాగే ఉంది మార్కెట్లో. కేజీ వెండి ధర రూ.100 పైకి కదిలింది. దీంతో ధర రూ.47,700కు చేరింది, ఇప్పుడు మార్కెట్లో వ్యాపారం భారీగా లేకపోయినా రేటు మాత్రం భారీగా పెరుగుతోంది. ఇంకా బంగారం ధర భారీగా పెరుగుతుంది అంటున్నారు వ్యాపారులు.