మళ్లీ ఊపందుకోబోతున్న వైసీపీ ఆపరేషన్…..ఈ సారి ముగ్గురు టార్గెట్ సర్కార్….

మళ్లీ ఊపందుకోబోతున్న వైసీపీ ఆపరేషన్...

0
81

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అంతే వేగంగా తమ్ముళ్లు మూటా ముళ్లు సర్దేసుకుంటున్నారు… ఇప్పటీకే టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కీలక నేతలు వైసీపీకి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే… ఇటీవలే ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దారాఘవరావు వైసీపీ తీర్ధం తీసుకున్నారు… ఇక ఈ షాక్ నుంచి చంద్రబాబు నాయుడు కోలుకోక ముందే మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు…

ఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నేతలను వైసీపీలోకి చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సీఎం జగన్ టీడీపీ బీజేపీలోని సీనియర్లపై దృష్టిపెట్టినట్లు అర్ధమవుతోంది… వైసీపీలో వీరి చేరికవల్ల ప్రయోజనం ఉంటుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే వరుస చేరికలను ప్రోత్సహించడం ద్వారా విపక్ష టీడీపీ బీజేపీలను పూర్తిగా నిర్విర్యం చేయాలన్న లక్ష్యం కనిపిస్తోంది… ఇదే కోవలో తాజాగా ఆయా పార్టీలకు చెందిన మంత్రులపై వైసీపీ దృష్టి సాధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…

గతంలో యూపీఎ హయాంలో ఓ వెలుగు వెలిగిన కేంద్రమంత్రులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పనబాక లక్ష్మీ కావూరి సాంబశివరావులను వైసీపీలోకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి… గతంలో వీరంతా వైఎస్ హయంలో ఎంపీ పదవులు దక్కించుకుని యూపీ ప్రభుత్వంలో కేంద్రమంత్రులుగా పని చేసిన వారే.. వీరిలో కోట్ల మినహాయిస్తే మిగిలిన ఇద్దరికీ వైఎస్ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి…