మల్లు స్వరాజ్యం అంత్యక్రియలు జరిగేది అక్కడే!

0
81

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. ఈ నెల 2న ఆమె అస్వస్థతకు గురికావడంతో బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేర్చారు. తర్వాత ఆరోగ్యం మెరుగుపడటంతో వెంటిలేటర్‌ తొలగించి సాధారణ గదికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి శుక్రవారం మళ్లీ ఆందోళనకరంగా మారడంతో ఐసీయూకు తరలించారు. నేడు ఆమె ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు.

మల్లు స్వరాజ్యం అంత్యక్రియలపై సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముది రెడ్డి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. ఆదివారం నాడు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని, సిపిఎం నల్లగొండ జిల్లా కమిటీ సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అన్నారు.