మామను ఫాలో అవుతున్నా అల్లుడు…

మామను ఫాలో అవుతున్నా అల్లుడు...

0
93

టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ రావు అల్లుడు నరసింహ ప్రసాద్ తన మామను ఫాలో అవుతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… శివప్రసాద్ రాజకీయాల్లోకి రాకముందు నటుడుగా మంచి పేరు ఉంది… టీడీపీ తరపున ఆయన ఎలాంటి పెద్ద పెద్ద పదవులు అనుభవించకపోయినా ఎంపీగా రెండు సార్లు విజయం సాధించారు… స్థానికంగా మంచి పేరు తెచ్చుకున్నారు వివాధాలకు, విమర్శలకు దూరంగా ఉండేవారు శివప్రసాద్ రావు…

ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ ఎదుట ఆయన వేసిన వేశాలు ఇప్పుటికీ ప్రజల కళ్ల ముందు కనిపిస్తాయి… 2019 ఆయన వాసుడిగా తన అల్లుడు నరసింహ ప్రసాద్ ను తీసుకువచ్చారు… రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వుడు కావడంతో అల్లుడిని అక్కడ నుంచి పోటీ చేయించారు…. కానీ వైసీపీ తరపున పోటీ చేసిన కోరుముట్ల శ్రీనివాస్ చేతిలో ఓటమి చెందారు…ఇక ఆతర్వాత శివప్రసాద్ రావు అనారోగ్యంతో మృతి చెందారు…ఇది ఇలా ఉంటే నరసింహ ప్రసాద్ ప్రజలకు దగ్గర అయ్యేందుకు మామను ఫాలో అవుతున్నారట..

సందర్భం ఏదైనా సరే తన మామ వివిధ వేశాలతో ప్రజలను ఆకట్టుకునేవారు… ఇప్పుడు నరసింహ ప్రసాద్ కూడా అదే ఫాలో అవుతున్నారు.. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇంగ్లీష్ మీడియం వద్దు తెలుగు మీడియం ముద్దు అనే నినాదంతో శ్రీకృష్ణ దేవరాయ వేశం వేసుకుని సెగ్మెంట్ లో సందడి చేశారు.. తాజాగా కరోనా వేశం వేయాలని చూశారు… కానీ పోలీసులు అనుకరించలేదు… తన మామ దారిలో నరసింహ ప్రసాద్ చేస్తున్న ప్రయత్నం ఎంతమేరకు ఫలిస్తుందో చూడాలి…..