శివుని ఆలయాల్లో పంచారామాలు కూడా ఒకటి, మన దేశంలో వీటిని నిత్యం దర్శించేందుకు చాలా ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తూ ఉంటారు భక్తులు.ఆంధ్రదేశ్ లోని 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రములే పంచారామాలని పెద్దలు చెబుతారు పురాణాలు చెబుతున్నాయి.
భీమేశ్వరుడు- ద్రాక్షారామము తూర్పు గోదావరి జిల్లా)
భీమేశ్వరుడు- కుమారారామము సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా
రామలింగేశ్వరుడు- క్షీరారామము పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా
సోమేశ్వరుడు- భీమారామము భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా
అమరేశ్వరుడు- అమరారామము అమరావతి, గుంటూరు జిల్లా
ఈ ఆలయాలు ఏపీలోనే ఉన్నాయి, అందుకే కార్తికమాసంలో ఈ ఆలయాలకు ప్రత్యేకంగా బస్సులు కూడా నడుపుతుంది ఆర్టీసీ, ప్రతీ కార్తికమాసంలో నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శనాలకు వస్తారు.