మ‌న దేశంలో పాఠ‌శాల‌లు కాలేజీల ద‌గ్గ‌ర ఈ ఫుడ్ ఇక అమ్మ‌రు

మ‌న దేశంలో పాఠ‌శాల‌లు కాలేజీల ద‌గ్గ‌ర ఈ ఫుడ్ ఇక అమ్మ‌రు

0
77

మ‌న దేశంలో చాలా వ‌ర‌కూ పిల్ల‌ల్లో కూడా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌డానిక ప్ర‌ధాన కార‌ణం వారు తినే ఫుడ్ అంటున్నారు వైద్యులు …ముఖ్యంగా 2010 నుంచి మ‌న దేశంలో జంక్ ఫుడ్ బాగా తిన‌డం అల‌వాటు చేసుకున్నారు.. డ్రింకులు ఇలాంటి వాటిని బాగా తాగుతున్నారు, దీని వ‌ల్ల ఆరోగ్యం దారుణంగా దెబ్బ తింటోంది.

ఇక మ‌న దేశంలోని విద్యా సంస్థల పరిసరాల్లో అనారోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేకుండా చేయాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ తెలిపింది. విద్యా సంస్థలకు 50కి.మీల పరిధిలో జంక్‌ ఫుడ్‌ అమ్మకాలు, ప్రచారంపై నిషేధం అమల్లో ఉంటుందని ఆ సంస్థ వెల్లడించింది.

ఇక ఫుడ్ కోర్టులు కాలేజీ స్కూల్లో అమ్మే ఇలాంటి ఫుడ్ ఇక బ్యాన్, , క్యాంటీన్లలో కొవ్వు, ఉప్పు, చక్కెర అధికంగా ఉన్న వస్తువులను అమ్మకూడదని తెలిపారు. విద్యార్థులకు సురక్షితమైన ఆహారం ఇచ్చే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈవో అరుణ్ సింగాల్‌ తెలిపారు. ఇక నిజంగా ఇవి విద్యార్దులు కూడా తిన‌డం త‌గ్గిస్తే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌వు అంటున్నారు వైద్యులు.