మన దేశంలో ఆర్మీ దగ్గర ఉన్న టాప్ 5 జాగిలాలు ఇవే

మన దేశంలో ఆర్మీ దగ్గర ఉన్న టాప్ 5 జాగిలాలు ఇవే

0
92

మనం పెంచుకునే కుక్క విశ్వాసానికి మారు పేరు.. మనం సాధారణంగా పెంచుకునే కుక్కలు మనపై ఎంతో ప్రేమ చూపిస్తాయి.
మనకు ఏమైనా చిన్న అపాయం వచ్చినా అవి తట్టుకోలేవు. మనతో అటాచ్ మెంట్ అవి ఏర్పరచుకుంటాయి…అయితే ఇలాంటి జాగిలాలు సాధారణంగా మనిషి కూడా చేయని కొన్ని పనులు చేస్తాయి.

పోలీసుల దగ్గర ఉండే సూపర్ డాక్స్ శిక్షణ తీసుకుని సీక్రెట్ ఆపరేషన్స్ లో పాల్గొంటాయి.. తాజాగా భారత సైన్యం పక్షాన ఉగ్రవాదులతో జరిపిన పోరాటంలో కీలకపాత్ర పోషించిన ఐదు సైనిక జాగిలాలకు అత్యుత్తమ ప్రశంసాకార్డులను సైనికాధికారులు అందించారు. కశ్మీర్ లో ఓ ఉగ్రవాది పై కాల్పులు జరిపారు పోలీసులు ఈ సమయంలో రక్తం కారుతున్నా పారిపోయాడు .. కాని ఆ రక్తం వాసన పసిగట్టి అతనిని వెంబడించి పోలీసులకు జెమ్ అనే ఆర్మీ డాగ్ పట్టించింది.

రోష్ అనే జాగిలం జమ్మూకశ్మర్ లోని ఓ గ్రామంలో చెక్కల వెనుక దాక్కున్న ఉగ్రవాదిని పట్టించింది….లాలమ్ అనే మరో ఆర్మీ డాగ్ అసోం రాష్ట్రంలోని బక్సా జిల్లాలో గత ఏడాది జులై 28వతేదీన ఉల్ఫా ఉగ్రవాదులు అమర్చిన మందుపాతరను గుర్తించింది. ..ముస్సీ అనే మరో జాగిలం జాతీయరహదారిపై ఇంఫాల్ దగ్గర మందుగుండుసామాగ్రిని కనుగొంది.. డాంబో అనే మరో జాగిలం మందుగుండు సామాగ్రిని గుర్తించింది. వీటికి ప్రసంసా పత్రాలు అందించారు. నిజంగా ఇలా చేయడం అంటే ఆ జాగిలాలు చాలా గ్రేట్ కదా..